Apr 17,2023 21:29

ప్రజాశక్తి - భీమడోలు
                అన్నేవారిగూడెం మండల ప్రజా పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలను వీడుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న చదువును పునాదిగా వేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్‌ మస్తాన్‌ కోరారు. పాఠశాల ఆవరణలో సోమ వారం తోటి విద్యార్థులు పాఠశాలను వీడుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌ పి.మౌనిక అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. విజేతలకు పాఠశాల యాజమాన్యం బహుమతి ప్రదానం చేసింది. పలువురు వక్తలు పాఠశాలను వీడుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ శుభాకాంక్షలు తెలిపారు.