Oct 30,2023 21:37

కార్యక్రమంలో మాట్లాడుతున్న జెఎన్‌టియు రెక్టార్‌ ఎం.విజరుకుమార్‌

             ప్రజాశక్తి-అనంతపురం   విద్యార్థులకు విద్యతోపాటు నైపుణ్యాలు చాలా అవసరమని జెఎన్‌టియు రెక్టార్‌ ఎం.విజరుకుమార్‌ సూచించారు. సోమవారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల మెకానికల్‌ సెమినార్‌ హాలులో సైన్సు, హ్యుమానిటీస్‌ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విద్యావిధానం-2020 సస్టేన్‌ బుల్టి అనే అంశంపై ఎఐసిటిఇ ప్యాకట్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో చదువుతో పాటు నైపుణ్యాలకు ఎంతో ముఖ్య పాత్ర ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు తమకున్న విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా పెంపొందించుకోవడానికి, విద్యార్థులకు నూతన విషయాలను అర్థమయ్యేలా బోధించేందుకు దోహదపడుతుందన్నారు. అధ్యాపకులు రీసెర్చ్‌, పేటెంట్స్‌, ఇన్నోవేషన్స్‌పైన దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఎస్‌వి.సత్యనారాయణ, ఉస్మానియా విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఇ.అరుణకాంతి, కె.యఫ్‌.భారతి, ఎం.రామశేఖరరెడ్డి, మాజీ ఆచార్యులు వి.శంకర్‌, కోఆర్డినేటర్‌ వి.బి.చిత్ర, కో కోఆర్డినేటర్‌ జి.మమత, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.