విద్యార్థులకు వైద్య పరీక్షలు
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో స్కూల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారిణి కల్పన విద్యార్థులకు స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు హిమోగ్లోబిన్ టెస్ట్ నిర్వహించామని వైద్యాధికారి డాక్టర్ కల్పన తెలిపారు. ప్రతి పాఠశాలలో ప్రతినెలా పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి, రక్తహీనతతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామన్నారు. 9గ్రాములు తక్కువగా ఉన్నవారికి ఐరన్ మాత్రలు ఇచ్చి, 8గ్రాములు కన్నా తక్కువ ఉన్న వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్థామన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.










