ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యార్థులు, పోలీస్ కుటుంబాల పిల్లలు, పోలీస్ ఉద్యోగులతో వ్యాసరచన, ఉపన్యాసం పోటీలు నిర్వహించారు. ఇందులో లైంగిక వేధింపుల నుండి మహిళలకు, పిల్లలకు రక్షణ, సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ మోసాలను అరికట్టడంలో సాంకేతికత పాత్ర అనే అంశాలపై పోటీలను చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించినారు. ఈపోటీల్లో విద్యార్థులు, పోలీసులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. విజయం సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి రూ.5వేలు, రెండో బహుమతి రూ.3వేలు, మూడో బహుమతి రూ.2వేలు ప్రధానం చేయనున్నారు.










