
ప్రజాశక్తి - ఆకివీడు
ప్రతిఒక్కరూ కష్టంతో గాక ఇష్టంతో విద్యనభ్యసించి మంచి అభివృద్ధిలోకి రావాలని గ్రామ సర్పంచి స్వరాజ్యం విద్యార్థులకు సూచించారు. మండలంలో అయిభీమవరం గ్రామం కనుమూరి వెంకట నరసింహరాజు జిల్లా పరిషత్ హైస్కూలులో కొన్ని సంవత్సరాలుగా ఎస్‌సి విద్యార్థులకు కెనరా బ్యాంక్ విద్యా జ్యోతి పథకంలో భాగంగా అందిస్తున్న ఉపకార వేతనాలు సోమవారం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సర్పంచి సామ్రాజ్యం మాట్లాడారు. కెనరా బ్యాంక్ మేనేజర్ ఎవిఎస్.శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకాల గురించి వివరించారు. అనంతరం 6, 7 తరగతుల విద్యార్థులకు రూ.2500 చొప్పున 8, 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.ఐదు వేలు తరగతికి ఒక్కరికి ఉపకార వేతనాలు చేశారు.