
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు కెనరా బ్యాంక్ వారు విద్యా జ్యోతి ఉపకార వేతనం పథకం ద్వారా పిఎల్‌కె హైస్కూల్ విద్యార్థులకు శుక్రవారం ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ బాల వెంకట్ మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా బాలికల విద్య ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కెనరా విద్యా జ్యోతి ద్వారా ఆరు నుంచి పదో తరగతి వరకు క్లాస్ ఫస్ట్ వచ్చిన ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థినులకు ఈ ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు చెప్పారు. 6, 7 తరగతి వారికి రూ.2500, 8, 9, 10వ తరగతి వారికి రూ.ఐదు వేల ఐదుగురికి అందించారు. అకౌంటెంట్ సాధన చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం టి.వెంకటలక్ష్మి, బిఆర్.అమర్‌కుమార్, జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్ పాఠశాల హెచ్‌ఎం భవానీప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనారు.