ప్రజాశక్తి-ఎటపాక
రాష్ట్ర ప్రభుత్వం అందించే బైజూస్ టాబ్‌లను ఎటపాక కేజీబీవీ పాఠశాల 8వ తరగతి విద్యార్థినులకు శనివారం ఎంపీపీ కాకా కామేశ్వరి, తహశీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో విఠల్ పాల్, ఎంఈఓ బాలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ టాబ్‌లను ఉన్నత చదువులకు, సబ్జెక్ట్‌లో నైపుణ్యం కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రిన్సిపల్ సత్యవేణి ఆధ్వర్యాన బైజూస్ ట్యాబ్‌లను ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జడ్పిటిసి ఒడుగుల జ్యోతి చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, నైపుణ్యతతో కూడిన విద్యను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి చప్పా చంద్రరాణి, వైసిపి జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్ రాజు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు చిడిపల్లి అప్పారావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు గణజాల తాతారావు, వైసిపి నాయకులు కనిగిరి వీరబాబు, అంకం రవి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.










