Dec 27,2022 23:51

ట్యాబ్‌లు అందజేస్తున్న కార్పొరేటర్‌ కొణతాల నీలిమ

ప్రజాశక్తి- అనకాపల్లి
స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు జీవీఎంసీ 80వ వార్డు కార్పొరేటర్‌ కొణతాల నీలిమ భాస్కరరావు మంగళవారం ప్రభుత్వం సరఫరా చేసిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తెస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్‌ కర్రి గంగాధరరావు, ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని త్యేగాడ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, కొత్తపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ఎమ్‌పిపి కలగా లక్ష్మి, జెడ్‌పిటిసి దంతులూరి శ్రీధర్‌ రాజు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కలగా గున్నయ నాయుడు, శ్యామ్‌ సన్‌, కెజిబివి ప్రిన్సిపాల్‌ చంద్రకళ, వైసిపి నాయకులు మలసాల కిషోర్‌, నీటిపల్లి లక్ష్మి, గొల్లివిల్లి శ్రీనివాసరావు, అద్దిపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : మండలంలోని కె.కోటపాడు, పాతవలస పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌, జెడ్పిటిసి అనురాధ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. కె.కోటపాడు పాఠశాలలో 83 మందికి, పాతవలసలో 36 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మధుమూర్తి, హెచ్‌ఎంలు బోలెం వెంకటరమణమూర్తి, శ్రీనివాస్‌, ఎంపీటీసీ లక్ష్మి పాల్గొన్నారు.
యలమంచిలి రూరల్‌ : మండలంలో పెద్దపల్లి, పురుషోత్తపురం, పులపర్తి, ఏటికొప్పాక గ్రామాలలో 8వ తరగతి విద్యార్థులకు బైజుస్‌ కంటెంట్‌తో కూడిన టెబ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బొద్దేపు గోవింద్‌, జెడ్పీటీసీ సంధ్య రాము, వైసిపి నాయకులు బొద్దపు యర్రయ్య దొర, మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పరవాడ : స్థానిక జెడ్‌పి బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ పైల సన్యాసిరాజు, వైస్‌ ఎంపీపీ లు బంధం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, వైసిపి నాయకులు అన్నంరెడ్డి అజరు రాజ్‌, చుక్క రాము నాయుడు, కోన రామరావు, పరవాడ సర్పంచ్‌ సిరిపురపు అప్పలనాయుడు, ఎమ్‌ఇఓ సనీత తదితరులు పాల్గొన్నారు.
వడ్డాది : వడ్డాది కేజీబీవీలో విద్యార్థులకు జెడ్పిటిసి దొండ రాంబాబు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దొండా లలిత నారాయణమూర్తి, కెజిబివి ప్రత్యేకాధికారి కొసూరి అన్నపూర్ణ, కోవెల జనార్దన్‌, తమరాణ వెంకట రమణ, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ వెలుగుల వరహాలు, హెచ్‌ఎం పివి శేషు బాబు పాల్గొన్నారు.
రోలుగుంట : విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తీసుకు వస్తున్నారని చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ కొనియాడారు. రోలుగుంట ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. మండలంలో 350 మంది విద్యార్ధులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరాలనే గొప్ప సంకల్పంతో సిఎం ఉన్నారని చెప్పారు. బైజూస్‌ సంస్థతో ఒప్పందం చేసుకొని విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాలను డిజిటల్‌ విధానంలో బోధించుటకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు ట్యాబ్‌లను వినియోగించుకొని బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యర్రంశెట్టి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
నర్సీపట్నం రూరల్‌ : మండలం వేములపూడి హైస్కూల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మంగళవారం ఎంపీపీ సుర్ల రాజేశ్వరి చేతుల మీదుగా ట్యాబ్‌ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ, విద్యార్ధులు బాగా చదవి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగరం సర్పంచ్‌ గొంప కన్నయ్యనాయుడు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
చీడికాడ : విద్యార్థులు సాంకేతికపరంగా అభివృద్ధి చెందాలని ఎంపీపీ, జడ్పిటిసి జయమ్మ, శారద వరలక్ష్మి అన్నారు. దిబ్బపాలెం గ్రామంలో విద్యార్థులకు కోపరేటివ్‌ అధ్యక్షుడు నందారపు రమణబాబు ఆధ్వర్యంలో ఎంపీపీ, జడ్పిటిసిలు ట్యాబులు పంపిణీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఆర్‌.దేమున్నాయుడు, ఎంపీటీసీ దారపు పెద్ది నాయుడు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ మరిడియా, అప్పారావు, నాగరాజు, మాణిక్యం పాల్గొన్నారు