Dec 22,2022 00:13

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

ప్రజాశక్తి - రంపచోడవరం
రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ట్యాబులు అందజేయడం జరిగిందని రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని ఇర్లపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ట్యాబ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ఈ ట్యాబ్‌లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎంవివి సత్యనారాయణ దొర, ఎటిడబ్ల్యూ రామ తులసి, ఎంపీడీవో ఎంవిఆర్‌ కుమార్‌ బాబు, ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, ప్రజా ప్రతినిధులు కర్రి పాపారాయుడు, జల్లేపల్లి రామన్న దొర, ఎ.సత్యనారాయణ రెడ్డి, పండా రామకృష్ణ, ఎంపీటీసీ తుర్రం వెంకటేశ్వర్లు దొర తదితరులు పాల్గొన్నారు.
మారేడుమిల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు 150 ట్యాబులు బుధవారం పంపిణీ చేశారు. జడ్పిటిసి గొర్లె బాలాజీ బాబ్ను, ఎంపీపీ సార్ల లలిత కుమారి, ఎంపీడీవో వీర కిషోర్‌ వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొండ జాకబ్‌, వైస్‌ ఎంపీపీ లక్కుండ రవికుమార్‌, వైస్‌ సర్పంచ్‌ బి వీరబాబు, పాఠశాల చైర్మన్‌ వీకా రామన్న దొర, ప్రధాన ఉపాధ్యాయురాలు ఈశ్వరి దేవి, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.