ప్రజాశక్తి- గాజువాక : ప్రజాశక్తి విశాఖపట్నం ఎడిషన్ ప్రారంభించి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఫకీర్‌తకియా గ్రామంలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం యుటిఎప్ స్టడీమెటీరియల్‌ను ఉచితంగా అందజేశారు. ప్రజాశక్తి విశాఖ ఎడిషన్ మేనేజర్ వెంకటేష్, ప్రొడక్షన్ ఇన్‌ఛార్జి సత్యనారాయణ, సిఐటియు నేత రామస్వామి ఆధ్వర్యంలో గ్రామపెద్దలు ఎస్‌కె.మదీనావలి, మోస చేతులమీదుగా విద్యార్థులకు అందజేశారు. ప్రజాశక్తి ఎడిషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాగా చదివి, మంచి గ్రేడింగ్‌తో ఉత్తీర్ణులు కావాలని ప్రజాశక్తి ఎడిషన్ మేనేజర్ వెంకటేష్ ఆకాంక్షించారు.
నర్సీపట్నంటౌన్:ప్రజాశక్తి దినపత్రిక ఆధ్వర్యాన మండలంలోని వేములపూడిలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను ఏపీ మధ్యాహ్న భోజన పథకం సంఘం జిల్లా అధ్యక్షులు కామిరెడ్డి ప్రసన్న ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ, 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని తెలిపారు. ఈ మెటీరియల్ చదివి విద్యార్థులు 10వ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిఐ టి యు నాయకులు డి.సత్తిబాబు, ప్రజాశక్తి డిఒ బి. రవిశేఖర్, ఆటో యూనియన్ అధ్యక్షులు కె.సత్తిబాబు, ఆశ వర్కర్ కె.లక్ష్మి, సంధ్యారాణి పాల్గొన్నారు
రోలుగుంట :మండల కేంద్రంలో జడ్పీ హైస్కూలు ఆవరణలో స్థానిక జనవిజ్ఞాన వేదిక నాయకులు కె.త్రిమూర్తులరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాశక్తి ప్రచురించిన 10వ తరగతి స్టడీ మెటీరియల్‌ను విద్యార్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు ఈ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఈరెల్లి చిరంజీవి, ప్రజాశక్తి సిబ్బంది కె.శంకర్, బి.రవిశేఖర్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










