ప్రజాశక్తి - పెద్దాపురం చిన్ననాటి నుండి శాస్త్రీయ దక్పథం అలవర్చుకోవడం ద్వారానే ఆధునిక సాంకేతిక విజ్ఞానంపై అవగాహన పెరుగుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్ అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో శనివారం ఆయన విద్యార్థులకు సైంటిఫిక్ టెంపర్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన దక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారానే వారు నేర్చుకున్న విజ్ఞానమంతా సమాజ పురోగతికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు సైన్స్ అనేక కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి అందించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలను అందించవలసిన బాధ్యత నేటి బాలలపై ఉందన్నారు. ప్రశ్నించడం ద్వారానే విజ్ఞానం అభివద్ధి చెందుతుందన్నారు. శాస్త్రీయ దక్పథాన్ని పెంచుకోవడం ద్వారా మూఢనమ్మకాలను వదిలించుకోగలుగుతామన్నారు. దుంగల పూజితా సూర్యశ్రీ, నీలపాల బాలమురళీకష్ణ, అమత, నమ్రత, కూనిరెడ్డి రవి పలు అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రొంగల అరుణ్, కూనిరెడ్డి అరుణ, దారపురెడ్డి కృష్ణ, మంజుల, ఐశ్వర్య, సూరజ్ పాల్గొన్నారు.
స్థానిక శాఖా గ్రంధాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భళ్లమూడి నాగమణి విద్యార్థులకు పాటలు పాడటం, పద్యాలాపనపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగం బుల్లయ్య, మరియమ్మ పాల్గొన్నారు.
యు.కొత్తపల్లి విద్యార్థులకు ఉప్పాడ గ్రంథాలయంలో క్రాఫ్ట్ శిక్షణా తరగతులు నిర్వహించారు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం 27వ రోజుకు చేరుకోవడంతో ఈ శిక్షణ తరగతులను 20 మంది విద్యార్థులకు ఉపాధ్యాయురాలు టి.నళిని, శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు.










