ప్రజాశక్తి-బాపట్ల: విద్యలో ఉన్నత ప్రమాణాలతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింత ప్రోత్సహిస్తామని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ అన్నారు. గురువారం ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని బాపట్ల మండలం అప్పికట్ల శంకర్ కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి నరేంద్రవర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి గ్రామానికి చెందిన ఆచంట సునీత అధ్యక్షత వహించారు. నరేంద్రవర్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి పురిటిగడ్డ అయిన అప్పికట్ల గ్రామం అంటే ఎన్టీఆర్ ఎనలేని అభిమానమన్నారు. ఈ గ్రామం ప్రజా చైతన్యానికి మారుపేరని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నరేంద్రవర్మ నగదు పురస్కారాలు అందజేశారు. జూనియర్ ఇంటర్‌లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన గండూరి భవ్య, నాలుగో ర్యాంకు సాధించిన నామినేని బ్రాహ్మణి, ఆ చంటి రిషిత, రొంపిచర్ల జీవనజ్యోతి, కె శ్రీదేవి, మర్రి జాహ్నవితో పాటు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన కోటి మేఘన, గుమ్మడి ఐశ్వర్యలను నరేంద్రవర్మ సన్మానించారు. తొలుత అప్పికట్లలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో తాత జయప్రకాష్ నారాయణ, సలగల రాజశేఖర్ బాబు, మానం విజేత, జిట్టా ప్రమీలారాణి, ఆకురాజు రాజేశ్వరి, ముక్కామల శివ, ఇనగంటి గాంధీ, గ్రామ సర్పంచ్ రాజేష్, భర్తీపూడి సర్పంచ్ ఆ చంటి అమరేష్, పట్టాభి రామారావు, ఇనుగంటి శ్రీనివాసరావు, కంతేటి అప్పారావు పాల్గొన్నారు.










