Oct 30,2023 23:16

పతకాలు సాధించిన విద్యార్థులు

ప్రజాశక్తి-కొండపి : మండల పరిధిలోని కట్టావారిపాలెంలో మన ఊరి వికాసం ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించినట్లు అంతర్జాతీయ తైక్వాండో మాస్టారు మారుతీ ప్రసాదు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన తైక్వాండో రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌ షిప్‌ పోటీలో బంగారు, వెండి, కాంస్య పతాకాలు సాధించినట్లు తెలిపారు. విద్యార్థుల మానసిక వికాసం, ఆత్మవికాసం పెంపుదలకు కృషి చేయుచున్న మన ఊరి వికాసం సంస్థ నిర్వాహకులు ధర్మవరపు ప్రసాదుకు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతులు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు అండగా నిలుస్తున్న అద్దేపల్లి సత్యనారాయణ, మెడికల్‌ షాపు రవికుమార్‌కు విద్యార్థుల తల్లిదండ్రలు కృతజ్ఞతలు తెలిపారు.