Jun 20,2023 19:26

బహుమతులు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయులు

ప్రజాశక్తి - మంత్రాలయం
మంత్రాలయం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హంపయ్య ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమంలో పారితోషికం విడుదల చేసింది. మంగళవారం నగదు ప్రోత్సాహకాన్ని విద్యార్థులకు అందజేశారు. ఇటీవల జరిగిన పదో తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో 523 మార్కులు సాధించిన పూజారి అశ్విని మొదటి స్థానంలో నిలవగా ప్రథమ బహుమతి కింద రూ.3 వేలు, ద్వితీయ బహుమతి 496 మార్కులు సాధించిన డి.ఉమేష్‌ రూ.2 వేలు, తృతీయ బహుమతి 482 మార్కులు సాధించిన డి.వీరేంద్రకు రూ.1000తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు రామన్న, విఠోబరావు పాల్గొన్నారు.