ప్రజాశక్తి-కొత్తకోట: చదువుతో ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చునని అనకాపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు రేబాక మధు అన్నారు. కొత్తకోటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సుమారు పరీక్షా సామగ్రి అట్టలు, పెన్నులు ఉచితంగా శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 10వ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలన్నారు. మరింతగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం.అప్పలరాజు, వసతి గృహ సంక్షేమ అధికారి రాము, దళిత సంఘం నాయకులు యాదగిరి దాసు తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్:చదువుతో మంచి స్థాయికి చేరుకోవచ్చని అనకాపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు రేబాక మధు అన్నారు. శనివారం నర్సీపట్నం ఎస్సీ బాలికల వసతి గృహ 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్షా అట్టలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నూకరాజు, ఉపాధ్యాయులు గాయత్రీ, అప్పలరాజు, వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి, దళిత సంఘ నాయకులు యాదగిరి దాసు తదితరులు పాల్గొన్నారు.
గొలుగొండ: మండలంలోని పాకలపాడు హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు టీడీపీ మండల కార్యదర్శి బొడ్డు సత్యనారాయణ, బిసి సెల్ అధ్యక్షులు బుర్ల రమణ ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రిని విద్యార్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు.










