Nov 02,2023 23:37
మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌

ప్రజాశక్తి-కనిగిరి: ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ అన్నారు. గురువారం కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం సమయపాలన పాటిస్తూ భోజనం పెడుతున్నారా లేదా భోజనం రుచికరంగా ఉందా లేదా అని ప్రత్యక్షంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థుల హాజరు సంఖ్య ఆధారంగా భోజనం ఏర్పాటు చేయాలని హెడ్మాస్టర్‌కు సూచించారు. పాఠశాలలో విద్యార్థులు కూర్చొని చదువుకొనుటకు మంచి టేబుల్స్‌ ఉండడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రతి విద్యార్థినీ ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.