
ప్రజాశక్తి -కోటవురట్ల: స్థానిక గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంకు బుధవారం జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు త్రిమూర్తులురెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిన్నారులతో దేశభక్తి గేయాల, పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంధాలయ అధికారి అప్పలనాయుడు పాల్గొన్నారు.
గొలుగొండ:స్థానిక శాఖా గ్రంథాలయంలో బుధవారం విద్యార్థులకు పాటలు పోటీలు నిర్వహించారు.పలువురు విద్యార్థులు దేశభక్తి గేయాలతో పాటు భక్తి గీతాలు జానపద గీతాలు ఆలపించారు. ఉపాధ్యాయులు రామకృష్ణ, గ్రంథాలయ అధికారి ఎన్. రాజబాబు పాల్గొన్నారు.
కొత్తకోట: శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థులతో పుస్తకము పఠనం, పేపర్ క్రాఫ్ట్స్ చేయించారు. వివిధ రకాల బొమ్మలను గీయించారు. ఈ కార్యక్రమం లో గ్రంధాలయాధికారి ఆర్.వరహమణి పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ : శాఖా గ్రంధాలయంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి.ప్రభాకరరావు మాట్లాడుతూ, కథలలో ఉన్న నీతి పిల్లలకు వివరిస్తే ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. పిల్లలకు కథలలు చెప్పి నీతిని బోదించారు. పిల్లలతో కధలు చదివించారు. ఇంగ్లీషు పదాలను ఉపయోగించి జంబిల్ గేమ్ ఆడించారు. గ్రంధాలయధికారిని పి. దమయంతి మాట్లాడుతూ, లైబ్రరీలతో ఉపయోగాలు, వాటి ఫలితాలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరరావు మాస్టారు పాల్గొన్నారు.
సింహాచలం: అడవివరం గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం ఆంగ్ల భాషపై అవగాహన కల్పించారు. అనకాపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంగ్ల భాష రాయటంతో పాటు చదవడం, మాట్లాడటంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి నరసింహం, రాజేంద్రప్రసాద్, భాను, విద్యార్థులు పాల్గొన్నారు.
ములగాడ: మల్కాపురం శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో ప్రముఖ అంబేద్కరీయులు పి.సిద్ధార్థ పాల్గొని అంబేద్కర్ చరిత్ర పుస్తకాలను విద్యార్థులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న అంబేద్కర్‌ను బాలలంతా అనుసరించాలని, విజ్ఞానాన్ని ఆర్జించాలని కోరారు. అనంతరం వేసవిలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సచివాలయ ఉద్యోగి మహేష్, వైద్య సిబ్బంది వివరించారు. ప్రాథమిక చికిత్స మందులను, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేశారు.
ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారులు కాగితాలతో పువ్వులను, బొకేలను, గ్రీటింగ్ కార్డులను తయారు చేసి ప్రదర్శించారు. వీటికి రిసోర్స్ పర్సన్స్‌గా వై.అనసూయాదేవి, లావణ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కె.సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్.భాగ్యలక్ష్మి సమన్వయం చేశారు.