
ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
పాలకొల్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నారు. శనివారం మొదటిరోజు ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ స్కూల్‌లో నిర్వహించిన పోటీలను పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ విఆర్‌ఎస్.శేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 66 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ముగింపు కార్యక్రమంలో బహుమతులు ఇవ్వనున్నట్లు పెనుమాక రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రావాడ సతీష్, మద్దాల వాసు, క్లబ్ చార్టెడ్ సెక్రటరీ మద్దాల రాంప్రసాద్, జిల్లా డైరెక్టర్ చంద్రక రాము, మాజీ ప్రెసిడెంట్ ముత్యాల శ్రీనివాసరావు, మైగాపుల రాంబాబు, మున్సిపల్ డిఇ సాంబశివుడు, టిపిఒ వీరబ్రహ్మం, రోటరీ సభ్యులు పోతాబత్తుల సత్యనారాయణ, కానూరు ప్రభాకరరావు పాల్గొన్నారు.