ప్రజాశక్తి-యంత్రాంగం విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిబిరాల్లో భాగంగా సోమవారం పలు అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌లో విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా కన్వీనర్ బుద్దా శ్రీనివాస్ క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ జీవిత విశేషాలపై వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్యాంపులో విద్యార్థులకు పాటలు పాడటంలో శిక్షణ ఇచ్చారు. సాయంత్రం నృత్య రూపకాల ప్రదర్శనలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులందరికీ కొల్లి దుర్గాప్రసాద్ స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కో ఆర్డినేటర్ రొంగల అరుణ్, కూనిరెడ్డి అరుణ, దారపురెడ్డి కృష్ణ, అమత, నమ్రత, రవికుమార్, సందీప్, ఐశ్వర్య, సూరజ్ పాల్గొన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో ఉపాధ్యాయిని వాడపల్లి విమలారాణి విద్యార్థులకు సంగీత స్వరాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు పాల్గొన్నారు. తాళ్లరేవు సమ్మర్ క్యాంప్ ద్వారా విద్యార్థులకు ఆహ్లాదం, ఆనందమే కాక సజనాత్మకత వస్తుందని జెవివి నాయకులు శ్రీరామ్ అన్నారు. వారం రోజులుగా తాళ్ళరేవు ప్రజాసంఘాల ఆఫీసు వద్ద నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు కార్యక్రమానికి శ్రీరామ్ సోమవారం పిల్లలకు మ్యాజిక్ షో, కాగితాల ద్వారా వస్తువులు తయారు చేయడం తదితర విషయాలను నేర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, అత్తిలి బాబూరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, తణుకు రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు, సీతారామపురం గ్రామానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఏలేశ్వరం మానవ జీవితం ఒక సైన్స్ ప్రయోగశాల అని రాజమండ్రి జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ కన్నూరి సతీష్ బాబు అన్నారు. స్థానిక గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా ఆయన హాజరై సైన్స్ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. గ్రంథాలయ పాలకులు కవికొండల సత్యనారాయణ వివిధ పాఠశాల విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.










