
విద్యార్థులకు పెన్నులు, ఫ్యాడ్‌లు అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-మార్కాపురం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు సాయం చేయడంలో సంతృప్తి ఉందని వైసిపి రాష్ట్ర మహిళా విభాగం సహాయ కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్సీ బీసీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని 185 మంది విద్యార్థినీ, విద్యార్థులందరికీ పెన్నులు, పరీక్ష అట్టలు, బిస్కెట్లు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రమీలారెడ్డి మాట్లాడుతూ పేదలకు, పేద విద్యార్థులకు తనవంతుగా సహాయ పడుతానని చెప్పారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆమెను ప్రత్యేకంగా అభినందించింది.