రాయచోటి : అన్నమయ్య జిల్లా లోని గిరిజన సంక్షేమ శాఖ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిం చడమే తమ లక్ష్యమని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్ సలాం పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో గిరిజన సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు, నాణ్యమైన భోజనం ఎలా అందిస్తున్నారో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాల్లో హాస్టలలో వార్డెన్లు, విద్యార్థుల వివరాలు తెలపండి ?
అన్నమయ్య జిల్లాల్లో 12 గిరిజన గురుకుల పాఠశాలలున్నాయి. వాటిలో ఒక ఆశ్రమ, 5 బాలికలు,6 బాలురు పాఠశాలలున్నాయి. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1799 మంది విద్యార్థులున్నారు. అందులో బాలికలు 845 మంది, బాలురు 954 మంది ఉన్నారు. 12 హాస్టళ్లు ఉన్నాయి. నలుగురు రెగ్యులర్ వార్డెన్లు విధులు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులకు కాస్మోటిక్ డబ్బులు అందుతున్నాయా?
జిల్లాలోని హాస్టళ్లు గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థులకు ప్రతినెలా ఇవ్వాల్సిన కాస్మోటిక్ ఛార్జీలను తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం. విద్యార్థులకు 2018 - 19 సంవత్సరంలో ఉన్న ఛార్జులు ప్రస్తుతం అమలు అవుతున్నాయి.
హాస్టల్ సిబ్బందికి బయోమెట్రిక్ అమలలో ఉందా ?
హాస్టల్ సిబ్బందికి బయోమెట్రిక్ విధానాన్ని అవలంభిస్తున్నాం. దీని వల్ల ఏ అధికారీ విధులకు హాజరు కాకపోతే వెంటనే ఉన్నతాధికారుల దష్టికి వెళుతుంది. దీనిపై సంజాయిస్తూ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధా నంతో సిబ్బంది పూర్తిగా విధులకు హాజరవుతున్నారు.
విద్యార్థులకు పుస్తకాలు, ఇతర కిట్లు అందుతున్నాయా?
విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోటి పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, ఇతర వస్తువులను కూడా ప్రతి విద్యార్థికి పూర్తి శాతంలో అందజేస్తున్నాం.
వంట మనసులు ఎంతమంది ఉన్నారు? ఖాళీలు ఏమైనా ఉన్నాయి?
జిల్లా వ్యాప్తంగా వంట మనుషుల పోస్టులు ఆరు మంజూరయ్యాయి. అందులో ప్రస్తుతం నలుగురు విధుల్లో ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి .
అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నారా? ఖాళీలు ఏమైనా ఉన్నాయి?
జిల్లాలోని సుండుపల్లె బాలురు2, రాయచోటి బాలురు 2, తంబళ్లపల్లె బాలురు 2, కె.వి పల్లె బాలికల 2, రాయచోటి బాలికల 5, రైల్వేకోడూరు మినీ గురుకులం బాలికల 3 ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి .
హాస్టళ్ల అభివద్ధికి ఎలాంటి చర్య తీసుకుంటున్నారు?
జిల్లాలోని హాస్టళ్ల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అద్దె భవనాలలో ఉన్న వసతి గహాలపై ప్రత్యేక దష్టి పెట్టింది. నాడు- నేడు కింద శాశ్వత భవనాలు నిర్మిస్తున్నాం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హాస్టళ్ల అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి, నాణ్యమైన విద్యను, పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. త్వరలో అన్నింటిని పూర్తి చేస్తాం










