Jul 17,2023 21:33

ఫొటో : నోటుపుస్తకాలు అందజేస్తున్న దృశ్యం

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని సింగనపల్లి మెయిన్‌ ప్రాథమిక పాఠశాల, ఏపిలగుంట మెయిన్‌ ప్రాథమిక పాఠశాల, టి.ఎన్‌.పేట ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు సోమవారం నోటు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పసుపులేటి వెంకటమ్మ సేవాసంస్థ కమ్మవారిపల్లి, పోరుమామిళ్ల మండలం, కడప జిల్లా, వసుధ ఫౌండేషన్‌, హైదరాబాదు వారి సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపిలగుంట మెయిన్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు మాట్లాడుతూ కడప జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు గడ్డం వెంకటరమణ, శ్రీనివాసులు, విశ్రాంత ఉపాధ్యాయులు శేషయ్య సహకారంతో తమ పాఠశాలకు ప్రతి సంవత్సరం నోటు పుస్తకాలు అందిస్తున్నారని తెలిపారు.
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రామసుబ్బయ్య, వెంకటసుబ్బయ్య, పాఠశాల కమిటీ చైర్మన్లు ఈటే మాధవి, మౌనిక, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ రెడ్డి, సహౌపాధ్యాయులు రవీంద్రా రెడ్డి, వీరభద్ర కుమారి, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.