పెన్నులు అందజేస్తున్న దృశ్యం
విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
కొడవలూరు:బుచ్చిరెడ్డిపాలెం సహారా ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మండలంలోని రామాపురంలో ఎంపీపీ ఎస్‌యు పి పాఠశాల, ఎంపీపీ ఎస్ ఉర్దూ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు షేక్ ఎజ్దానీ బాషా మాట్లాడుతూ ప్రతేడాది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలకు విద్యాసామగ్రి పంపిణీ చేశామన్నారు.కార్యక్రమానికి సహాయం చేసిన తాళ్ల స్వామికి సంస్థ తరఫున కతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. హెచ్‌ఎం అనసూయమ్మ మాట్లాడుతూ ఈ సంస్థ వారు పల్లెటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద పిల్లలకు విద్యాసామగ్రిని పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పటాన్ రహమతుల్లా, షబ్బీర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










