పుస్తకాలు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :వలేటివారిపాలెం మండలం శాఖవరంలోని ఎస్‌సి కాలనీలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం నోట్ పుస్తకాలు పలకలు, పెన్సిళ్లను ఆర్యవైశ్య మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు పంపిణీ చేశారు. కేశవరావు మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డోలా రమేష్ సూచన మేరకు పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పలకలు ,నోటు పుస్తకాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి మనసుతో విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు పలకలు అందించిన చక్కా కేశవ కు ప్రధానోపాధ్యాయులు డోలా రమేష్ ధన్యవాదాలు తెలిపారు.ప్రముఖ ఉపాస్ హాస్పిటల్ మేనేజర్ రామకష్ణ పాల్గొన్నారు.










