Feb 24,2023 23:10

ప్రజాశక్తి - చింతలపూడి
               విద్యార్థులకు నాణ్యమైనా విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌వి.రవి సాగర్‌ అన్నారు. మండలంలోని ఫాతిమాపురం అంగన్‌వాడీ సెంటర్‌, నగర పంచాయతీలోని ఉర్దూ పాఠశాలను ఆయన పరిశిలించారు. ఫాతిమాపురం అంగన్‌వాడీ సెంటర్‌లో నెల రోజులుగా పాలు రావడం లేదని అంగన్‌వాడీలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ దృష్టిలో పెట్టి ఈ సమస్య పరిష్కరిస్తామని డిఇఒ తెలిపారు. అనంతరం ఉర్దూ పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని, మెరుగైన విద్యతో పాటు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ రామరావు పాల్గొన్నారు.