Oct 12,2023 21:35

  చింతలపూడి : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తహశీల్దార్‌ కృష్ణజ్యోతి తెలిపారు. మండలంలోని లింగగూడెం ఆర్‌సిఎంపి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, చిన్నతనం నుంచి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని తెలిపారు. విద్యార్థులకు పుస్తక పఠనాలతో పాటు జనరల్‌ నాలెడ్జి కూడా నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ సంయుక్త ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.