ప్రజాశక్తి - చిప్పగిరి
విద్యార్థులకు మెరుగైన శిక్షణతో కూడిన విద్యనందించాలని ఎంఇఒలు సావిత్రమ్మ, బాలనాయుడు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని ఎంఆర్‌సి భవనంలో ఎంఇఒలు సావిత్రమ్మ, బాలనాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపిడిఒ కొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఇఒలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు కృషి చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు, విద్యార్థుల అటెండెన్స్‌ను తప్పకుండా పాటించాలని తెలిపారు. జగనన్న విద్యా దీవెన, స్టూడెంట్స్ డ్రాపౌవుట్స్, నాడు-నేడు కార్యక్రమం ద్వారా జరుగుతున్న పనులపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలో టీసీలు తీసుకెళ్తున్న విద్యార్థులు, ఏ పాఠశాలలో, కళాశాలలో చేరుతున్నారో వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి, వివరాలు సేకరించాలన్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్‌సి ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంఇఒ










