Nov 15,2023 23:29

బ్యాంకు కార్యకలాపాలు చూపిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-యర్రగొండపాలెం
విద్యార్ధులకు క్షేత్ర పర్యటన ద్వారా విజ్ఞానం పెరుగుతుందని ఎంఈవో పి ఆంజనేయులు తెలిపారు. బుధవారం వాదంపల్లి గ్రామంలోని ఎంపీయూపి పాఠశాలకు చెందిన విద్యార్థులు క్షేత్ర పర్యటనలలో భాగంగా యర్రగొండపాలెంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి వాటి విధి విధానాలను తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇలా చేయడం మూలంగా విజ్ఞానంతో పాటు మంచి అనుభూతి, ఆనందం కలుగతుందని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌, తహసిల్దార్‌ కార్యాలయం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎంపిడివో ఆఫీసు, అగ్నిమాపక కేంద్ర కార్యాలయము, మండల విద్యా వనరుల కేంద్రాలను విద్యార్థులు సందర్శించినట్లు తెలిపారు. ఎస్‌ఐ జి కోటయ్య, తహశిల్దార్‌ రవీంద్రారెడ్డి, ఎంపీడీవో నాగేశ్వర ప్రసాద్‌, ఎస్‌బిఐ మేనేజర్‌ నాగరాజు, ఎంఈఓలు ఆంజనేయులు, మల్లు నాయక్‌లు విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాల గురించి, వాటి ప్రాధాన్యత, ఆవశ్యకత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు ఆంజనేయులు, మల్లు నాయక్‌, సర్పంచ్‌ పబ్బిశెట్టి మంజులా శ్రీను, పిఎంసి చైర్మన్‌ చెన్నకేశవులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు, ఉపాధ్యాయులు అల్లూరి శ్రీను, రాజేంద్రప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.