మదనపల్లె అర్బన్ : విద్యార్థులు ఈ దశలో తమ జీవితంలోఎలాంటి దురాలవాట్లకు అవకాశం ఇవ్వకుండా క్రమశిక్షణతో సత్ప్రవర్తనతో మెలిగితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని టూ టౌన్ సిఐ ఎస్. మురళీకష్ణ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ కష్ణారెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో అవేర్నెస్ ఆన్ యాంటీ డ్రగ్ అండ్ సైబర్ అవేర్నెస్ అనే సెమినార్ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశానికి నిజమైన సంపద యువతేనని, మన శత్రు దేశాలు యువతని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో మాదకద్రవ్యాలను మన దేశంలోనికి ప్రవేశపెడుతున్నాయని తెలిపారు. శత్రు దేశాల దుష్టపన్నాగాలను తిప్పుకొట్టేందుకు యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన వైఖరి అవలంభిస్తున్నాయని ఎవరైనా మాదకద్రవ్యాలు డ్రగ్స్ కొనినా, అమ్మిన వారి పైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవితం చాలా విలువైందని మాదకద్రవ్యాలు వినియోగం వల్ల మనిషి విచక్షణారహితంగా ప్రవర్తించటం వల్ల వారి కుటుంబాలు చాలా వరకు నాశనమవుతున్నాయని చెప్పారు. మారుతున్న కాలాన్ని బట్టి కూడా సైబర్ నేరస్తులు ఇప్పటికీ పలు రకాల లింకులతో మోసం చేస్తున్నారని నకిలీ మెసేజ్ల పట్ల నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా ఫోన్ చేసిన ఒటిపి కానీ, వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్ప రాదని సూచించారు. ఎవరైనా సైబర్ క్రైమ్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలని ఆయన తెలియజేశారు. ార్యక్రమంలో టూటౌన్ ఎస్‌ఐ శ్రీ సుబ్బా రెడ్డి కళాశాల కరస్పాండెంట్ శ్రీ కష్ణారెడ్డి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










