Oct 30,2023 20:08

కార్యక్రమంలో మాట్లాడుతున్న అంబవరం ప్రభాకర్‌రెడ్డి

 కడప సిటీ విద్యార్దులు క్రమశఇతోపాటు నైతిక విలువలు అలవరుచుకోవాలని జిల్లా విధ్యాశాఖాధి రాఘవ రడ్టి, సర్వశిక్ష అభియాన్‌ జిల్లా అధికారి అంబవరం ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఫౌండేషన్‌ లిటరసీ, న్యూమారసిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్స్‌, సూపర్‌వైజర్లు, ప్రాథమిక పాఠశాల ఉపా ధ్యాయులకు ఆరు రోజులపాటు రెసిడెన్షియల్‌ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈసందర్బంగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌ రెడ్డి మాట్లా డుతూ మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలు తప్పకుండా చదవడం, రాయడం,, చతుర్విధ ప్రక్రియలను చేయగలిగేలా చేయడం శిక్షణ కార్యక్రమం ఉద్దేశమన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం జ్ఞానంతో పాటు లోకజ్ఞానం పెంపొందించే దిశగా విద్యాబోధన చేయాలన్నారు. నైతిక విలువలు పెంపొందించి నిజ జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడూ శిక్షణను పొంది నాణ్యమైన విద్యా బోధనకు కషి చేయాలని అన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి రాఘవ రెడ్డి మాట్లాడుతూ మూ డు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి వారికి ఆట పాటలు, కత్యాలు, కథల ద్వారా బోధన చేసినట్లయితే వాళ్ళు చక్కగా అవగాహన చేసుకుని నేర్చుకో వడానికి వీలవుతుందన్నారు. ఆరోగ్యంగా, మానసికంగా బాగా ఉన్నప్పుడు అభ్యసన స్థాయి బాగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అకాడమీక్‌ మానిట రింగ్‌ అధికారి ధనలక్ష్మి, రామాంజనేయ రెడ్డి, విజయలక్ష్మి, కీ రిసోర్స్‌ పర్సన్‌ వరలక్ష్మి పాల్గొన్నారు.