Aug 08,2023 19:18

ప్రజాశక్తి - ఉంగుటూరు
      కైకరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలను హెడ్మాస్టర్‌ గుళ్ల ప్రసాదరావు ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు జూనియర్‌ స్థాయి, సీనియర్‌ స్థాయి పరుగు పందెం పోటీలు, ఇతర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.