Sep 27,2023 21:21

ఫొటో : విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు

విద్యార్థులకు కంటి పరీక్షలు
ప్రజాశక్తి-ఆత్మకుకూరు అర్బన్‌  :  పట్టణంలోని జెడ్‌పి బాలు ఉన్నత పాఠశాలలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష స్కూల్‌ స్క్రీనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా గత రెండు రోజుల నుండి పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు సుమారు 350 మందికి డాక్టర్‌ ఆర్‌ వినోద్‌ కుమార్‌ కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు అందజేస్తారని డాక్టర్‌ తెలియజేశారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కోటేశ్వరమ్మ, ఉపాధ్యాయులు రత్నం, ఆశా వర్కర్లు రమణమ్మ, కాంతమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.