ప్రజాశక్తి-పాడేరు : స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా లో 25,131 విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిగా 1311 మంది విద్యార్థులకు దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించామని అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ టి.విశ్వేశ్వర నాయుడు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, దృష్టిలోపం గుర్తించిన విద్యార్థులకు తగిన చికిత్సలు, కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జి టిడబ్ల్యూఏ తలారిసింగి స్కూల్‌లో 46 మంది విద్యార్థులకు, లోచలిపుట్టులోని జిటీడబ్ల్యూఏ పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కంటి అద్దాలు ఆయన బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు కంటి కలక, కంటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.










