ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి మండలం శంఖవరప్పాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కళ్ల జోళ్లు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంటి సమస్యలతో బాధపడుతున్న 21 మంది విద్యార్థులకు దాత సోము రమణారెడ్డి సౌజన్యంతో కళ్ల జోళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రోటరీ ప్రెసిడెంట్ సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆహారంలో ఏ విటమిన్ లభించే ఆకుకూరలు, కారట్, గుడ్డు వంటివి తీసికొని జాగ్రత్తలు పాటించి కంటి జబ్బులు దూరం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు లక్కరాజు శ్రీనివాసరావు, రోటరీ ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, సభ్యులు చప్పిడి వీరయ్య, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, పువ్వాడ రామకోటేశ్వరావు, నర్రా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










