May 10,2023 01:46
అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తున్న ఎంపిపి, జెడ్పిటిసి

ప్రజాశక్తి-వేమూరు: ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ విద్యనభ్యసించాలని ఎంపిపి డివి లలితకుమారి సూచించారు. భట్టిప్రోలు మండలంలోని పెసర్లంక డికె ఉన్నత పాఠశాలలో పది పరీక్షలలో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులను మంగళవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. మండల ద్వితీయ స్థానంలో 559/600 సాధించిన పట్టపు అఖిల పాఠశాల ద్వితీయ స్థానంలో 524 మార్కులు సాధించిన భార్గవి, కార్తికేయలను సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించటానికి కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు ఎస్‌కె బాషా, ఇతర ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం నాడు నేడు పనులలో భాగంగా నిర్మించనున్న రెండు అదనపు తరగతి గదులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వేములపల్లి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి చంటి, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ ఉన్నారు.