ప్రజాశక్తి - ముసునూరు
దంతాలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉంటారని దంత వైద్యులు దివిశెట్టి దినేష్‌బాబు అన్నారు. మండల కేంద్రమైన ముసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దంత వైద్యలు దివిశెట్టి దినేష్ బాబు విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యాయులు యువరాజు, బి.సుకుమార్, ఎం.శ్రీనివాసరావు, రత్నమాల, నాగేశ్వరరావు పాల్గొన్నారు..










