
ప్రజాశక్తి - తణుకు
లయన్స్ క్లబ్ జిల్లా డిప్యూటీ సెక్రటరీ వావిలాల సరళాదేవి ఆర్థిక సాయంతో స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం సాల్విన్ ఆర్మీ ఫీస్ ఆఫ్ హోంలోని విద్యార్థులకు దీపావళి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు దీపావళిని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాక్షసులపై దేవతలు సాధించిన విజయమే దీపావళి అన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో దీపావళి వెలుగులు నింపాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ ప్రిన్సిపల్ స్వరాజ్యం, లయన్స్ లీడర్స్ కెఎన్.పద్మావతి, వావిలాల శాంతిప్రసన్న, బూరుగుపల్లి వెంకట్రావు, బూరుగుపల్లి లలిత పాల్గొన్నారు.