విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు
రేణిగుంట : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం గురుజాడ జయంతి సందర్భంగా బాలికల పాఠశాలలో సభ నిర్వహించి చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి కన్వీనర్ ఓ. వెంకటరమణ మాట్లాడుతూ గురుజాడ రచనలు ప్రగతి బాట కాలాతీతుడని, దేశభక్తి గీతం ఉన్నతమైన భావాలతో కూడినదని, దేశమంటే మనుషులని, మత బేదాలు విడిచి పెట్టి అన్నదమ్ముల్లా కలసి వుండాలని, ఆధునిక కవిత్వం ద్వారా వాడుక భాషలో అందించారన్నారు. సంఘ సంస్కరణ, స్తీ చైతన్య లాంటి అనేక రచనలు చేసిన దార్శనికుడు అన్నారు. నేడు ఐక్యత, సహనం, అభ్యదయాన్ని గురుజాడ దగ్గర నుంచి నేర్చుకో వలసింది అని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధనం ఉపాధ్యాయులు పాల్గొన్నారు! అనంతరం విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు.
సర్టిఫికేట్లతో విద్యార్థులు










