ప్రజాశక్తి - టి.నర్సాపురం
మండలంలోని గండిగూడెంలోని ఎంపీపీ పాఠశాలలో భూక్యా గోపయ్య సక్రమ ఫౌండేషన్ కన్వీనర్ భూక్యా వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకూ చదువుతున్న 140 మంది విద్యార్థులకు భోజన ప్లేట్లు, పెన్నులు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ భుక్యా గోపయ్య సక్రమ ఫౌండేషన్ ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రతిఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యా కమిటీ ఛైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచబంటు వేములయ్య, కొరివి రమేష్, భూక్యా శ్రీనివాస్, దొద్దుల రాంబాబు, ఆలా వెంకట్, చేను వెంకన్న, చింతం నరసింహారావు, విద్యా కమిటీ ఛైర్మన్ కోట నాగు, ఆలా బాబురావు, పేరుబోయిన దుర్గయ్య, ఉపాధ్యాయులు భూక్యా కుమారి, అరుణ, వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.










