Mar 30,2023 22:43

ప్రజాశక్తి మైలవరం
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం సోమేశ్వరరావు అన్నారు.గత నెల 20వ తేదీన ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి పబ్లిక్‌ మోడల్‌ పరీక్షను విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మండల స్థాయిలో బహుమతులు గురువారం జి కొండూరు పాఠశాలలో బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలలో విద్యార్థులు ముందుకు వెళ్లాలంటే ఒక లక్ష్యం పెట్టుకొని చదవాలన్నారు. విద్యా రంగంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకుని పైనించాలన్నారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండల కార్యదర్శి సంగీత. సురేష్‌,ఆక్స్ఫర్డ్‌,శ్రీ శ్రీ, వివేకానంద, పాఠశాలల ప్రిన్సిపల్స్‌, కరస్పాండెంట్లు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.