Oct 26,2023 23:51

గుంటూరులో ఆయుధాల గురించి విద్యార్థులకు వివరిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి గుంటూరు సిటి : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం గుంటూరులోని పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ఓపెన్‌ హౌస్‌ను అదనపు ఎస్పీ కె.కోటేశ్వరరావు, డీఎస్పీ చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. బాంబుడిస్పోజబుల్‌ టీం, ఫింగర్‌ ప్రింట్‌, పోలీసు కంట్రోల్‌ రూమ్‌, కమ్యూనికేషన్స్‌, గురించి వివరించి నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్‌ స్వ్కాడ్‌ బందాలు, ఆయుధాల విడి భాగాల సమాచారం తోపాటు ఎకె 47, విల్‌ పిస్టల్‌, గ్లో 17, కార్బన్‌ ఆయుధాలను 207 వజ్ర వాహనం, ల్యాండ్‌ మైన్‌ ప్రూవ్‌ వాహనం, ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలు, బాడీ ఒన్‌ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాను ప్రదర్శనలో ఉంచారు. పోలీస్‌ డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయని. ఎఅర్‌ అర్‌ఐలు రాజారావు, థామస్‌రెడ్డి, రమేష్‌ కృష్ణన్‌, రాఘవయ్య పాల్గొన్నారు.