అవగాహన కల్పిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -వెంకటాచలం :స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో నెల్లూరు-2, సి.ఐ. వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చెముడుగుంటలోని జెడ్‌పి హైస్కూల్లో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో సి.ఐ. మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. భాస్కరరావు, రమణ, సబ్ ఇన్‌స్పెక్టర్ శకుంతలదేవి ఉన్నారు.










