పుస్తకాలు అందిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్
ప్రజాశక్తి - చీరాల : ప్రస్తుత పోటీ ప్రపంచంలోబ విద్యార్థి దశ నుంచే ఆంగ్ల భాషపై పట్టు అవరసమని పద్మ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఘంటా అనిల్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆంగ ్లభాషపై విద్యార్థులకు పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆంగ్ల భాష సులువుగా అర్థం చేసుకునేందుకు అనిల్ కుమార్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫై రచించిన పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మహమ్మద్ ఖాసిం, ఉపాధ్యాయులు బుర్ర బ్రహ్మం, డేగల అశ్వనీ, బుర్ల రామకష్ణ పాల్గొన్నారు.










