Dec 08,2022 23:52
ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: లింగ వివక్షత, ఆడపిల్లలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎదుర్కోవడంపై స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల 1లో ఐసిడిఎస్‌ సిడిపిఓఎస్‌ రాజేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ రాజేశ్వరి మాట్లాడుతూ, బలవంతపు వివాహాలు, గృహ హింసలను వ్యతిరేకించాలన్నారు. చదువుతోపాటు సమాజంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న అత్యాచారాలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు, గ్రామ సచివాలయ మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.