ఆటల పోటీలలో పాల్గొన్న బాలలు
ప్రజాశక్తి-రేపల్లె: చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాఫ్ ఆధ్వర్యంలో బాలరక్షణ కమిటీ బాలల పంచాయతీ అధ్యక్షతన మండలంలోని పిరాట్లంక జడ్పీ హైస్కూలు ఆవరణలో కల్చరల్ అండ్ లిటరరీ కాంపిటేషన్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలకు లెమన్ అండ్ స్పూన్, పిరమిడ్ గ్లాసెస్, బకెట్ ఇన్ ది బాల్, ఐడెంటి ది నంబర్స్, బొమ్మలను గుర్తించటం తదితర ఆటల పోటీలు సూపర్ సబ్ జూనియర్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చైల్డ్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాఫ్ ప్రోగ్రాం మేనేజర్ ఎన్ శ్రీనివాసరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










