ప్రజాశక్తి అద్దంకి: విద్యార్థులు చక్కటి విద్యను కొనసాగించాలంటే మంచి పౌష్టికాహారం ఎంతైనా అవసరమని, దీనిని దృష్టిలో ఉంచుకొని మండలంలోని తిమ్మాయపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు కెవి శ్రీనివాసరావు దాతల సహకారంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు దాదాపు 200 మందికి అందించే కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ ఉన్నత పాఠశాలకు దాదాపు మండల ఇతర మండలాల పరిధిలో దాదాపు 22 గ్రామాల విద్యార్థులకు, ముండ్లమూరు, పంగులూరు గ్రామాల పరిధిలో కొంతమంది విద్యార్థులు విద్యనభ్యసించేందుకు చేరుకుంటారు. రానున్న పదో తరగతి పరీక్షల కోసం పాఠశాలలో స్టడీ అవర్స్ జరుగుతున్న క్రమంలో వారు సాయంత్రం అల్పాహారం కోసం గ్రామంలోని చిన్నపాటి హౌటల్స్‌కు రావలసిన దుస్థితి ఏర్పడడంతో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతిభా విద్యా సంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వరరావు 10 రోజులకు, చెన్నుపల్లి వాసు మరో మూడు రోజులకు విద్యార్థులకు అల్పాహారం అందించేం దుకు ముందుకు వచ్చారు. ఈ మంచి పనికి దాతలు ఎవరైనా ముందుకు రావాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు, తల్లిదండ్రుల కోరిక మేరకు గ్రామానికి చెందిన ఘంటసాల ప్రసన్న తమ తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం అతి తక్కువ ధరకే ముందుకు వచ్చారు.










