ప్రజాశక్తి-పాడేరు:విద్యార్దుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, గోరుముద్దలో భాగంగా మరో పోషకాహారం రాగి జావను చేర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు వారానికి మూడు రోజులు రాగి జావను అందిస్తామన్నారు. మంగళవారం సిఎం క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో రాగి జావ పంపిణీని సీఎం ప్రారంభించిన సందర్భంగా కలెక్టరేట్లో లాంచనంగా రాగిజావ పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 2,704 పాఠశాలల్లోని 91,412 మంది విద్యార్దులకు లబ్ది చేకూరు తుం దన్నారు. రాగి జావలో ఐరన్, కాల్షియం, పోటాషియం అధికంగా ఉంటాయన్నారు. విద్యార్దులతో మాట్లాడుతూ, క్లాస్ టీచర్, ఇంగ్లీషు టీచరు ఉన్నారా అని ఆరా తీసారు. పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వెయ్యి ఆంగ్ల పదాలను నేర్చుకుంటే ఇంగ్లీషు బాగా మాట్లాడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఇఓ ఎస్‌కె సలీం భాషా, డిఆర్‌ఓ పి.అంబేద్కర్, విద్యాశాఖ సహాయ సంచాలకులు ఉదయ భాస్కర్, డిఎస్‌ఓ ఆర్.శివ ప్రసాద్, డిఎం బి.గణేష్ కుమార్, వివిద పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగూడ:ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకంతో విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం లభిస్తుందని ఎంపీపీ బి.ఈశ్వరి చెప్పారు. మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు కే.బాలాజీ పథకం ప్రారంభించారు. ఎంపీపీ ఈశ్వరి, జెడ్పిటిసి సిహెచ్ జానికమ్మ, సర్పంచ్ వి.వెంకటరావు విద్యార్థులకు రాగిజావను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎస్.రామచందర్‌రావు, వైసీపీ మండల నాయకులు బి.సింహాచలం, విద్యా కమిటీ చైర్మన్ ఎం మేరీ, ఏపీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
హుకుంపేట: మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీ డొంకినవలస ఎంపీపీ స్కూల్‌లో విద్యార్థులకు రాగి జావను వైస్ ఎంపీపీ.సూడిపల్లి కొండలరావు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాకూరు రాజుబాబు, డొంకిన వలస వార్డ్ మెంబర్ మజ్జి రాజారావు పాల్గొన్నారు.
అరకులోయ:విద్యార్థులకు పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అరకులోయ జెడ్పిటిసి రోషిణి, ఎంపీపీ ఉషారాణి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ భారతి రత్నం రాగి జావ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి, ఎంపీపీ మాట్లాడుతూ, విద్యార్థులకు పోషక విలువలు అందించేందుకు పోర్టు ఫ్రైడ్ రైస్ అందించిన ప్రభుత్వం రాగి జావా కూడా అందిస్తుందన్నారు. రాగిజావతో ఎముకల్లో శక్తి పెరుగుతుందన్నారు. రక్తహీనత లోపాన్ని నివారిం చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వేణుగోపాలరావు, ఇన్చార్జి ఎంపిడీవో రాంబాబు, ఏటిడబ్ల్యుఓ మల్లికార్జునరావు, ప్రధానోపాధ్యాయుడు సుందర్రావు, వైసీపీ నేత అశోక్, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, ఎల్బి భీమరాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి : విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని స్థానిక జెడ్పిటిసి గంగరాజు, ఎంపీపీ శెట్టి నీలవేణిలు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని టోకురు పంచాయతీ పరిధి బాలికల పాఠశాలలో బేటి బచావో భేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పలు సదుపాయాలు కల్పిస్తుందని,ఉన్నత చదువులు చదివి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిణి ఎన్ సూర్యలక్ష్మి డమ్ముకు, అనంతగిరి 2, .టోకూరు కేంద్రాలలో సందర్శించి గర్భిణులు, బాలింతలకు స్టాక్ హౌమ్ ఐటమ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోసియా, ఎంపీటీసీ రత్నకుమారి పాల్గొన్నారు
సీలేరు : జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా మంగళవారం సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామన్నపడాల్ విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ కమిటీ చైర్మన్ నీతు పాల్గొన్నారు.
కొయ్యూరు : మండలంలోని చీడిపాలెం పాఠశాలలో తహసీల్దార్ తిరుమలరావు విద్యార్ధులకు రాగి జావ పంపిణీ చేశారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.దళిత ఎమ్మెల్యేపై దాడిని నిరసిస్తూ..










