విద్యార్థుల సంక్షేమం పట్టని ప్రభుత్వం- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్
రాయచోటి టౌన్ : విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని యుటిఎప్ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా రెండవ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ దేశంలో అందరికీ విద్య, వైద్యం, న్యాయం కోసం నిరవధిక పోరాటం చేస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో విద్యా రంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాషాయ మూకలు నూతన విద్యా విధానాన్ని ముందుకు తీసుకొని వచ్చాయని యుజిసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ) లాంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గపూరితంగా విద్యార్థుల మెదడులో హిజాబ్ అంశాలతో విద్యార్థులను వారిలో ఉన్న సజనాత్మకతను చీకటి రోజుల్లోకి నెట్టివేసే ప్రయత్నం జరుగుతున్నదని తెలిపారు. వెంటనే విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెక్యులర్ భావాలు కలిగిన దేశంలో మతోన్మాదం మత ఉన్మాదంతో దేశంలో ప్రజాస్వామ్యంనీ కలరస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులందురూ పోరాటాలు ద్వారా హక్కులను కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రాథమిక విద్యను మొదలుకొని ఉన్నత విద్య వరకు అంగడి సరుకుగా అమ్ముతున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు హామీలు ప్రకటించి జేబుదొంగ ప్రభుత్వముగా మరో చేత్తోలాక్కుంటున్నాడని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా అందించలేదన్నారు. వైద్య రంగాన్ని వైద్య విద్యను అమ్ముకోవడం సరియైన పద్దతి కాదని పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాలక ప్రభుత్వ వ్యాపార ప్రభుత్వము తేల్చుకోవాలన్నారు. విద్యార్థులసంక్షేమంమరిచిపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ వసతి గహాలు వార్డెన్, డిఎస్‌సి, జూనియర్ లెక్చరర్లు, ఖాళీగా ఉన్న పోస్ట్‌లను భర్తీ చేయాలని, హాస్టల్, స్కూల్, జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీ విద్యాసంస్థలకు నిధులు తక్షణమే కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి కార్తీక్, నరసింహ, జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, సహాయ కార్యదర్శి మనోజ్, కోడూరు నాయకులు రమణ, రాజేష్ రాయచోటి చందు, సునీల్ నాయక్, సోను, ఉపేంద్ర, చిన్నరెడ్డి పాల్గొన్నారు.










