Nov 08,2023 00:19

పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతి

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతి
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌
నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల హాస్టల్‌లోని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం ప్రిన్సిపల్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భగత్‌ రవి, ఉపాధ్యక్షులు అక్బర్‌ మాట్లాడుతూ హాస్టల్‌లో మెస్‌, మెయింటేనెన్స్‌ పేరుతో రూ.2500ల వరకు వసూళ్లు చేస్తూ విద్యార్థులకు మాత్రం అరకొర సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. హాస్టల్‌లో కడుపు నిండి తినలేక అర్థాకలితో గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యుత్‌ సమస్యల వలన రాత్రి సమయంలో లైట్లు, ఫ్యాన్లు లేక సరిగా చదువుకోలేక అవస్థలు పడుతున్నారని ప్రిన్సిపల్‌ దృష్టికి తెచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఈ సమస్యలు తన దష్టికి రాలేదని వెంటనే ఈ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి తేజ, పవన్‌, పురుషోత్తం, చక్రి పాల్గొన్నారు.