విద్యార్థుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని ప్రభుత్వ, ప్రయియివేట్ పాఠశాలల్లో విద్యార్థి భౌతికంగా చదివే పాఠశాల హాజరు పట్టి ఆన్‌లైన్‌లో పేరు నమోదై ఉండాలని మండల విద్యాశాఖ అధికారులు షేక్ మస్తాన్ వలీ, తోట, శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రయివేట్ పాఠశాలలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించి యాజమాన్యాలకు పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి తరగతినందు విద్యార్థులు భౌతికంగా ఏపాఠశాల్లో చదువుతున్నారో అపాఠశాల్లోని హాజరు పట్టీ చైల్డ్ ఇన్ఫో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదై ఉండాలన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థి హాజరై ఉన్నప్పటికీ విద్యార్థి వివరాలు హాజరు పట్టి ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదన్నారు. హెచ్‌ఎంలు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసి హాజరుపట్టీలో హాజరు వేయాలన్నారు. లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










